తెలంగాణ విమోచన దినం:సెప్టెంబరు 17,1948 --- పోచంపల్లి తిరుపతిరెడ్డి ============================================================================================== 15 ఆఘస్టు 1947 నాడు భారత దేశ ప్రజలు పండగ చేసుకుంటుండగా హైదరాబాద్ సంస్థానంలో భయానకర పరిస్థితులు నెలకొన్నవి.నిజాం నిరాంకుశ పాలనలో రజాకార్ల ఆక్రుత్యాలు పెరిగిపోయి ప్రజల ధన,మాన,ప్రాణ నష్టం జరిగినది.రజాకార్లు, నిజాం పోలీసులు, సైనికులు కలిసి దాదాపు 2000 మందిని చంపేశారు. భైరాన్ పల్లిలో 90 మందిని,పరకాల లో 22 మందిని, గుండ్రాంపల్లి 15 మందిని కాల్చి చంపారు.తెలంగాణ సాయుధపోరాటం ఉద్రుతంగా నడుస్తున్నది. రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బి.యెన్.రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి తదితర నేతల అద్వర్యంలో ప్రజలు తిరగబడడము మొదలయ్యింది. పీఠం కదులుతుందేమోనని నిజాం కు భయం పట్టుకుని 1947 నవంబర్ 29న భారత ప్రభుత్వంతో స్టాండ్ స్టిల్( యధావిధంగా ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. వాటిలో ఆఘస్టు 15 కు ముందు బ్రిటిష్ ఇండియాతో హైదరాబాద్ కు ఉన్న వాణిజ్య, రక్షణ,సైనిక ఒప్పందాలు యధావిదంగా కొనసాగించడం తో పాటు హైదరాబాద్, డిల్లి లో ప్రతినిదులను నియమించుకోవడం లాంటివి మ...